ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సీతక్క.

ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

మంగళవారం ము*లుగు జిల్లా కేంద్రం లో ములుగు నుండి పత్తిపల్లి వరకు వయా దేవగిరి పట్నం రోడ్డు పునరుద్ధరణ (రెన్యూవల్) రూ. 656.00 లక్షలతొ గిరిజన సంక్షేమ శాఖ రహదారి 5.5 కి.మిటర్లు పనులకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అదనపు కలెక్టర్ పి.శ్రీజ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ డి. వీరభద్రమ్, ఏ ఈ ఈ ప్రణిత, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా ఈ రోజు ములుగు జిల్లా కేంద్రం లో బండారుపల్లి రోడ్డు ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం ముందు యువకులు, పిల్లల వ్యాయామం కొరకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన (జిమ్) ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. షభరిష్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ లతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking