రాజేశ్వరపురం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి దేవాలయానికి విరాళం అందించిన టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు 30,000 రూపాయలను కమిటీ సభ్యులకు విరాళంగా అందించారు..ఈ కార్యక్రమంలో కుమ్మరి వీరబాబు సలవాది శ్రీను కుమ్మరి పుల్లయ్య కుమ్మరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు..