ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బదిలీ సహజమే ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 27 : ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బదిలీ సహజమేనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్ సి ఓ గోపీచంద్ నాయక్ అన్నారు. గురువారం మహాత్మ జ్యోతిబాపూలే కళాశాల, పాఠశాల ప్రిన్సిపల్ గౌతమ్ కుమార్ రెడ్డి హైదరాబాదుకు బదిలీ అయిన సందర్భంలో పాఠశాలలోఘనంగా పూలమాలలు శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆర్ సి ఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ…ఉద్యోగి తాను పనిచేసే చోటా పనిచేసే సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పుడు జీవితాంతం గుర్తుండిపోతారని తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల లో కెల్లా గొప్పదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. గౌతమ్ కుమార్ రెడ్డి చిన్న వయసులోనే గ్రూపు-1 అధికారిగా ఎంపికై ప్రిన్సిపాల్ తో పాటు ఆర్సిఓగా పనిచేయడం అతని యొక్క మేధా సంపత్తికి నిదర్శనం అన్నారు.గురుకుల పాఠశాలలో ఐదున్నర సంవత్సరాలు పని చేసిన కాలంలో పదవ తరగతి పాటు ఇంటర్మీడియట్లో కూడా 100కు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయ సిబ్బందితో అహర్నిశలు శ్రమించాడని తెలిపారు. పనిచేసే చోట కాకుండా కరీంనగర్ జిల్లాలో కూడా ఆర్ సి ఓ గా విధులు నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నాడని గుర్తు చేశారు.అనంతరం గౌతమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నేను పని చేసినంత కాలం నాకు సహకరించిన ఉపాధ్యాయ సిబ్బందిని అభినందించడమే కాకుండా నాకు చాలా పేరు తెచ్చి పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు.నేను లేకున్నా కూడా ఈ పాఠశాలకు ఉపాధ్యాయ సిబ్బంది వచ్చిన ప్రిన్సిపల్ కు సహకరించి పేరు తీసుకొచ్చేలా శ్రమంచాలని సూచించారు.అనంతరం ఇదే కళాశాలలో గ్రేడ్ వన్ లెక్చరర్ గా పనిచేసిన సంగీత మేడంకు కూడా గ్రేడ్ వన్ ప్రిన్సిపాల్ గా జైనథ్ పాఠశాలకు బదిలీ అయిన సందర్భంగా ఆమెను కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking