ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 9:
ట్రస్మా రాష్ట్ర జాయింట్ ట్రెజరర్ గా ఎన్నికైన రాపోలు విష్ణువర్ధన్ రావును మంచిర్యాల ట్రస్మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్మా స్టేట్ అడ్వైజర్, అదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా ట్రస్మా రాష్ట్ర స్థాయిలో నెలకొన్న అనేక సమస్యలను చక్కదిద్దడంలో రాపోలు విష్ణువర్ధన్ రావు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్ధయ్య మాట్లాడుతూ, రాపోలు విష్ణువర్ధన్ రావుతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి విషయంలో కూడా రాపోలుకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, ట్రస్మా అనే పేరుతో రిజిస్టర్ అయిన ఏకైక సంఘం మాదే అని, వేరే ఎవరైనా ట్రస్మా పేరును వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సన్మాన గ్రహిత రాపోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ, తనకు పదవులు ముఖ్యమైనవి కావని, విద్యాసంస్థల ఎదుగుదల, కరస్పాండెంట్లకు సేవ చేయడమే తన లక్ష్యమని అన్నారు.
ఇంతటి ఘన సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.