మెదక్ తూప్రాన్ డిసెంబర్ 21 ప్రాజబలం న్యూస్ :-
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు మహాలక్ష్మి స్కిమ్ కింద ఉచిత ప్రయాణం కల్పించడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ధర్నాలు నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్లు వారి ఉపాధి కోసం కొట్లాడుతున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో ఆటో యూనియన్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాల్ రాజ్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని మరియు అర్హులైన ఆటో డ్రైవర్లను ఆర్టీసీలో తీసుకొని హెల్పర్లుగా డ్రైవర్లుగా ఆటో ల సేవలను ప్రభుత్వ సంస్థలలో ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు.