ఘనంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 11

భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల శాఖ ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలని జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో అన్నదాన కార్యక్రమం మరియు సత్యసాయి మానసిక వికలాంగుల పాఠశాలలో చిన్నారులకు పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టి కేక్ కట్ చేస్తూ, చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు లు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ సామాన్య కార్యకర్త నుండి కోపరేట్ డైరెక్టర్ గా, కరీంనగర్ కార్పొరేటర్ గా, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రిగా వచ్చిన నాయకుడే బండి సంజయ్ అని పేద ప్రజల కష్ట -సుఖాలను తెలుసుకొని సాయం చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి వందేళ్లు జీవించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతరవేణి రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్, మండల ఉపాధ్యక్షుడు భీమిరి కిషన్ రావు, లింగమూర్తి, నవీన్ తత్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking