ట్రైనీ ఐ.ఏ.ఎస్ లు బయోలాజికల్ ఈ లిమిటెడ్ యూనిట్ యూనిట్ సందర్శన

 

ట్రైనీ కలెక్టర్లకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచనలు

వ్యాక్సిన్లను అందజేస్తున్నందుకు సైంటిస్టులను ట్రైనీ ఐఏఎస్ లు అభినందన

గురువారం రోజున తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడిన 2023 బ్యాచ్ కు చెందిన ఏడు మంది ట్రైనీ ఐ.ఏ.ఎస్ లకు శిక్షణలో భాగంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశాంక్ గోయల్, ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు జీనో మ్ వ్యాలిని సందర్శించి అక్కడ బయోలాజికల్ ఈ లిమిటెడ్ సెజ్ యూనిట్ కు సంబంధించిన సైంటిస్టులను వివిధ రకాల వ్యాక్సిన్ల తయారీ విధానాన్ని సైంటిస్టులు ట్రైనీ కలెక్టర్లకు వివరించారు. ఇండియన్ మెడికల్ సైన్స్ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతతో కూడిన వ్యాక్సిన్లను అందజేస్తున్నందుకు సైంటిస్టులను ట్రైనీ ఐఏఎస్ లు అభినందించారు. అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ ను సందర్శించి వివిధ పాలన అంశాలకు సంబంధించిన సూచనలను ట్రైనీ కలెక్టర్లకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వివరించారు.తదుపరి అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ డాక్టర్ వెంకట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking