జిల్లా అధికారులతో సమీక్షించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్

 

రాజన్న సిరిసిల్ల జిల్లా,
02 జూలై 2024,
ప్రజాబలం ప్రతినిధి
రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎస్పీ అఖిల్ మహజాన్ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సాదరంగా స్వాగతించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు రీసర్చ్ అధికారి డి. వరప్రసాద్ లతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు . విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ, అభివృద్ధి, రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు.

అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. రెవెన్యూ శాఖ, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, , ఈ డి – ఎస్.సి కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు.

ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రతి శాఖల వారీగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం పాత్రికేయులతో *జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు మాట్లాడుతూ*రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ఎస్సీలకు రావాల్సిన హక్కులు వారికి అందుతున్నాయా లేదా పరిశీలించి సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.

ఎస్సీలకు కేటాయించిన అసైన్డ్ ల్యాండ్స్ పట్టాలు అందించే అవకాశం పై రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి తగిన ఆదేశాలు జారీ చేశామని, విదేశీ విద్య పథకం, గురుకుల పాఠశాలలో ఎస్సి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి సౌకర్యాల, బెస్ట్ అవైలబుల్ స్కూల్ పై రివ్యూ చేసామని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సకాలంలో పరిష్కరించాలని, వీటిపై పార్లమెంట్ 2018 లో 18 ఏ సేక్షన్ కింద ఎస్సీలు అందించిన ఫిర్యాదులకు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి సంబంధిత నేరస్తులను అరెస్టు చేయాల్సి ఉంటుందని అన్నారు. అన్యాయం జరిగిన నిమ్న వర్గాల ప్రజలకు అండగా ఎస్సీ కమిషన్ ఉంటుందని, దీనిని ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు. గతంలో జరిగిన నేరెళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వానికి నిష్పక్షపాత విచారణ మరోసారి నిర్వహించాలని సూచనలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఈ డి ఎస్ సి కార్పొరేషన్ వినోద్ సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు రమేష్ రాజేశ్వర్ తహసిల్దార్లు జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking