జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 15
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో
జమ్మికుంట పట్టణంలోని స్పందన అనాధాశ్రమంలో
పేదల రక్షణ కవచం, ఆయనే ఒక ధైర్యం, ఆయనే నమ్మకం, నిజాయితీకి నిలువెత్తు రూపం, అపర చాణక్యుడు, పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో తెలంగాణ ప్రజల సమస్యపై గళమెత్తి, తెలంగాణ ప్రజా పాలనకు దోహదపడిన మన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టిన రోజు సందర్భంగా జమ్మికుంట కేంద్రంలోని స్పందన అనాదాశ్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సజ్జు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు, అంతేకాకుండా కేక్ కటింగ్,స్వీట్లు, పండ్లు, చాక్లెట్లు , బిస్కెట్లు పంపిణీ చేశారు.ఆయన ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆయన అన్నారు. ఉపముఖ్యమంత్రి కాకుండా ఇంకా ఉన్నత స్థాయి పదవులు చేకూర్చాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడెపు సారంగపాణి, టౌన్ ప్రెసిడెంట్ సుంకరి రమేష్, ఎండి రంజాన్, యాట్ల అశోక్, దొడ్డే నవీన్,సతీష్ రెడ్డి, అశోక్, సంపత్, ఉడుత వెంకటేష్, మహేష్ ,అంజిరెడ్డి,అఫ్రోజ్, రోమాల రాజు కుమార్, మైస సురేష్, ఫయాజ్, సల్లు బాబా, సాగర్ తదితరులు పాల్గొన్నారు.