జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 29
మా కొడుకు కోడలు గడ్డి జ్యోతి గడ్డి శ్రీనివాస్ లతో మాకు ప్రాణహాని ఉంది అని గడ్డి రాములు చంద్రకళ దంపతులు తెలిపారు. ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లె గ్రామానికి చెందిన గడ్డి రాములు చంద్రకళ జమ్మికుంట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డి రాములు చంద్రకళ దంపతులు మాట్లాడుతూ మాకు ముగ్గురు సంతానం అందులో గడ్డి శ్రీనివాస్ మా మొదటి సంతానం అని తెలిపారు. గడ్డి శ్రీనివాస్ కుటుంబ పోషణ భారమైన సందర్భంలో ఎలాగైనా నా కొడుకును ఆయన పిల్లలను పోషించే విధంగా చేయాలనే ఉద్దేశంతో వేరే వారి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇవ్వగా ఇచ్చినవారు ఇబ్బందులకు గురి చేస్తే బిడ్డ ఆ డబ్బులు ఇవ్వవా అని అడిగినందుకు మమ్మల్ని చంపుతానని ఊరంతా తిరుగుతూ నాన్న హంగామా సృష్టించి మాపై దాడి చేసి,ఆస్తి కోసం వేధిస్తున్నామని బదనం చేస్తున్నాడని దంపతులు తెలిపారు. మేము కన్నందుకు కనీసం మాకు బుక్కేడు అన్నం పెడతాడు అని ఆశ పడితే మా పైనే కర్రలతో దాడికి దిగి వాతలు వచ్చే విధంగా కొట్టారని వాళ్ళు వాపోయారు.