విద్య వైద్యరంగంలో నిర్దిష్టమైన చర్యలు చేపట్టాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తునమన్న. ….పి డబ్ల్యు ఒ జాతీయ కన్వీనర్ సంధ్య

 

వచ్చే బడ్జెట్లో విద్యకు 15% కేటాయించాలి.

సంగారెడ్డి జులై 6 ప్రజ బలం ప్రతినిది:
పి డి ఎస్ ఏర్పాటు చేసిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా పి ఓ డబ్ల్యు జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ …విద్య ఉద్యోగంపై 10 సంవత్సరాల పాలనలో విద్యకు జరిగిన మార్పుల లో సాధించిన ఘనత శూన్యం అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి ప్రణాళికలు ప్రవేశపెట్టాలని 10 సంవత్సరాల కెసిఆర్ పాలనలో మహిళలపై చట్టం చేయడంలో విఫలమైందని అన్నారు. మహిళా కమిషన్ వేయడంలో విఫలమైందని అన్నారు. వైద్యము, విద్య రంగాలలో నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతు సమస్యలపై ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రొఫెసర్ లక్ష్మినారాయణ సెంట్రల్ యూనివర్సిటీ, మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పై జరిగిన పేపర్ లీకేజీ అవకతవకలపై విద్యార్థులు చదువులు విడిచిపెట్టి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని, వెంటనే దీనిపై ప్రభుత్వం నిట్ పరీక్ష రద్దు చేయాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడడానికి నీళ్లు, నిధులు, నియామకాలు, ముఖ్య కారణమని,,.దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ను ఇప్పటికైనా ప్రకటించాలని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 12 వందల ఉద్యోగాలు ఉంటే, ఇప్పటి వరకు 300 వరకే పోస్టులను భర్తీ చేశారని, విద్యకు ఇంతకుముందు వచ్చే బడ్జెట్లో 15% బర్జెంటు కేటాయించాలని అన్నారు. విద్యా కమిటీల సూచనల మేరకు బర్జెంట్ ను కేటాయించాలని, ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వము ఏర్పడి ఏడు మాసాలు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిని ఇంతవరకు కేటాయించలేదు, కావున వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని చెప్పారు. అలాగే ఏడవ గ్యారంటీని కూడా విద్యా హక్కు కు బడ్జెట్లో పదిహేను శాతం కేటాయించాలని కోరారు. టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగంలో సూచించిన విధంగా చదువులపై కేంద్ర ప్రభుత్వం 10% కేటాయిస్తుంది. రాష్ట్రప్రభుత్వం ఐదు శాతం వాటా ను కేటాయిస్తుంది. మూతపడిన పాఠశాలలను తెరిపిస్తానని అన్నారు, కాని 25 రోజులు గడుస్తున్నా ఇప్పటికి తెరిపించలేదని ప్రభుత్వాన్ని తీయబెట్టారు. టీచర్ల బదిలిని చెప్పకుండానే రేషనలైజేషన్ చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్ర లో విద్య మంత్రిని ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసి విదంగా దృష్టి పేటలాని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సురేష్ , రాకేష్ సహాయ కార్యదర్శి, శ్రీశైలం ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నాగరాజ్, మధు, రియాజ్ , నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking