ప్రతి కార్యకర్త ప్రజా క్షేత్రంలో నిలవాలి
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు తధ్యం
కార్యకర్తలకు అండగా ఉంటా…
పార్లమెంట్ సమావేశాల్లో పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై కేంద్రాన్ని నిలదీస్తా
ఖమ్మం ప్రతినిధి జనవరి 24 (ప్రజాబలం) ఖమ్మం
పార్లమెంట్ ఎన్నికలనేపథ్యంలో ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో నిలిచి బీఆర్ఎస్ పార్టీ విజయా నికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి బిఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలవడం తధ్యమని ఆ పార్టీ లోక్ సభ పక్ష నాయకులు , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ఎంపీ నామ ఉదయం నుంచి ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ ప్రజా ప్రతినిధుల నుంచి ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేశారు . ఈ సందర్భంగా
ఎంపీ నామా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నేపధ్యంలో ప్రతి కార్యకర్త సంసిద్ధులై ఉండాలన్నారు పార్లమెంటు నియోజకవర్గ
ప్రజలకు నిత్యం అందు బాటులో ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు .రానున్న పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు ఇతర సమస్యల మీద పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం అని చెప్పారు గురువారం జరిగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి సంబంధిత అధి కారులతో మాట్లాడి, వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని నామ చెప్పారు. అతి త్వరలో పార్లమెంటు నియోజక వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీ నాయకులను, కార్యకర్తలను ,అభిమానులు శ్రేయోభిలాషులను కలుస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తన దృష్టికి పార్టీ ప్రజా ప్రతినిధులు ,
ప్రజలు తన దృష్టికితీసుకొచ్చిన సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేశారు ఎంపీ నామ. ఎంపీ నామా ను కలిసిన వారిలో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఖమ్మం, పాలేరు ,మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజక వర్గాల నుంచి పార్టీ ప్రజా ప్రతినిధులు ఎంపీపీలు నాయకులు,కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ తో పాటు వివిధ మండలాల పార్టీ నాయకులు తాళ్లూరి జీవన్, దండా పుల్లయ్య బెల్లం వేణుగోపాల్ ,బాణాల వెంకటేశ్వరరావు టీఏసీ సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, పోట్ల శ్రీను , చిరంజీవి , చెరుకుమల్లి రవి, మాలోత్శకుంతల, కిషోర్ బోయినపల్లి సుధాకర్ ,వాజేపల్లి లక్ష్మారెడ్డి చేబ్రోలు మల్లికార్జునరావు, పెoట్యాల పుల్లయ్య ,బోజెడ్ల రామ్మోహన్ రావు ,ఏలూరి శ్రీనివాసరావు , సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ , వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొని నామతో వివిధ సమస్యలపై చర్చించారు .