మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రి భవనం నిర్మాణంకు వారం రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 06 : మంచిర్యాల లో మాతా శిశు ఆసుపత్రి భవనం నిర్మాణంకు వారంరోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు.శనివారం గోదావరి రోడ్ లోని మాతా,శిశు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. ఈసందర్భంగా వైద్యులు,పేషంట్లతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు.ఐబీ స్థలంలో మాతా,శిశు ఆసుపత్రి నిర్మాణంకు అనుమతి లభించిందని చెప్పారు. త్వరితగతిన భవనం నిర్మాణం జరిపించి ప్రస్తుతం మాతా, శిశు ఆసుపత్రి వల్ల మహిళలు పడుతున్న అవస్థలను తొలగిస్థానని భరోసా ఇచ్చారు. మాతా శిశు ఆసుపత్రిని గోదావరి తీరాన నిర్మించడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.ఆసుపత్రిలో రెండురోజుల క్రితం రాత్రి విద్యుత్ అంతరాయం కలగడం విచారకరమన్నారు. మరోసారి రోగులు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురావద్దని ఆసుపత్రి నిర్వహణ అధికారిని ఆదేశించారు.ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఆసుపత్రి ఉద్యోగులు విధి నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్యులు,అన్ని విభాగాల సిబ్బంది,టెక్నీషియన్ లు సమయపాలన పాటించాలని ఆసుపత్రికి వచ్చే మాతా, శిశువులకు ఇబ్బందులు కలిగించవద్దని ఎమ్మెల్యే సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking