ఆరోపణలు కాదు సాక్ష్యాలు ఏవి

– ఆధారాలతో మాట నిలబెట్టుకున్న ప్రణవ్,

– ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ తప్ప ఏం లేదు

– ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలైనా ఒక్క మంచి పని హుజురాబాద్ కు చేశారా?

– హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జూన్ 25

హుజరాబాద్ నియోజకవర్గం లో సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్న నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉద్యోగాల పేరుతో తమని మోసం చేశాడని బాధితులు స్పష్టమైన ఆధారాలతో చెల్పూర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చిన కూడా తన దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఆసత్యమైన ఆరోపణలు మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు అన్నారు. కౌశిక్ రెడ్డి విసిరిన సవాలుకు తాము సిద్ధమని ప్రకటించిన తర్వాత దాంట్లో భాగంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో సవాల్ విసిరగా దానికి కౌశిక్ రెడ్డి వస్తానని అన్నారు.కానీ తన చిత్తశుద్ధి కౌశిక్ రెడ్డి మనస్సాక్షికి తెలుసునని కౌశిక్ రెడ్డి చెప్పినవన్నీ అభధ్ధాలు అని,ఎమ్మెల్యేగా తన దగ్గర ఆధారాలతో ఆరోపణలు చేయాలే గాని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని అన్నారు.స్థాయికి మించి మంత్రి పై అరోపణలు చేసే కౌశిక్ రెడ్డి ఆధారాలు చూపాలని అన్నారు. తాము విసిరిన సవాల్ కు కట్టుబడి తాము ఆధారాలతో సహా మీడియా ముందు ప్రవేశపెట్టామని స్వయంగా ఎవరైతే డబ్బులు ఎమ్మెల్యేకు ఇచ్చారో వారే చెల్పూర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో తడి బట్టలతో కొబ్బరికాయ కొట్టారని,మీడియా సమక్షంలో కౌశిక్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని చెప్పారని,కానీ ఎమ్మెల్యే దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపెట్టమని అడిగితే ఓవర్ లోడ్ పేరుతో ఓవర్ యాక్షన్ చేసి పారిపోయాడని అన్నారు.
దేవుడి పై ఒట్టేసి అబ్దద్ధాలు ఆడడం సిగ్గు చేటనీ,ఇంత దిగజారి రాజకీయాలు చేయడం మంచిది కాదని,ఎన్నికల సమయంలో కుటుంబాన్ని అడ్డు పెట్టాడని హుజురాబాద్ లో ఉనికి కాపాడుకోవాలని దేవుడిపై ఒట్టేసి అబద్ధాలు చెప్తున్నారని అన్నారు.ఇకపై హుజూరాబాద్ అభివృధ్ధి పట్ల దృష్టి సారిస్తామని,చిల్లర ఆరోపణలు చేయడం కాంగ్రెస్ పార్టీలో లేదని,దిగజారుడు బ్లాక్ మెయిల్ చేయడంలో కౌశిక్ రెడ్డి చరిత్ర సృష్టించాడని అన్నారు.ఆధారాలు లేకుండా నేటి నుండి మంత్రి పై అరోపణలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి ఆరు నెలలైనా హుజురాబాద్ కు ఒక మంచి పని కూడా చేయలేదని రాజకీయాల్లో కౌశిక్ రెడ్డి ఒక జోకర్ అని అన్నారు. తాము ఆధారాలు ఉంటేనే మాట్లాడుతామని అన్నారు.

– నేరేళ్ళ మహేందర్ మాట్లాడుతూ…

కౌశిక్ రెడ్డి విసిరిన సవాల్ కు ప్రతి సవాల్ విసిరాము, హుజురాబాద్ నుండి పారిపోయిన కౌశిక్ రెడ్డి అని ఆరోపించారు.పార్టీలో ఉన్నప్పుడే నీ పై అరోపణలు చేశా.మా దగ్గర తీసుకున్న 25 లక్షలు మళ్ళీ అడుగితే అని నన్ను జైల్ లో పెట్టించావు. దేవస్థానానికి వస్తున్న తరుణంలో మా కార్యకర్తల మీద లాఠీ ఛార్జి జరిగింది అని అన్నారు.

– మరో బాధితుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ..

కౌశిక్ రెడ్డి అవినీతి రాష్ట్రం దాటిపోయింది.తనకు ఇంట్లో సభ్యునిగా ఉన్నా సమయంలో హైకోర్టు జడ్జి మా బంధువు అని కోర్టు లో పోస్టులు పడ్డాయని నా దగ్గర 24 లక్షలరూపాయలు తీసుకున్నాడు.మా ఇంటి కుటుంబ సభ్యులు దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను. విష్ణు వర్ధన్ రెడ్డి అయినా మా అల్లుడు అతను డబ్బులు అడిగితే బెదిరించాడు. అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టే రకం కౌశిక్ రెడ్డి.తిరుమల గిరి హెచ్.పి.పెట్రోల్ బంకు లో ఇచ్చాను.ఇంకా కొన్ని డబ్బులు ఇంటి దగ్గర ఇచ్చాను.ఎలక్షన్ లో ఓడిపోతానో అని చిన్న పాపను ముందు పెట్టి ఓట్లు అడిగావు.తెలంగాణా ఉద్యమంలో కోట్లాడిన వ్యక్తి పొన్నంప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనది గొప్ప స్థానం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, పత్తి కృష్ణారెడ్డి, దేశిని కోటి, పొన్నగంటి మల్లయ్య, సుంకర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking