దర్గా అభివృద్ధికి కృషి చేస్తా.

ఉర్సు ఉత్సవాల్లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూన్ 18

జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉర్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఉర్సు సందర్భంగా బిజిగిరి షరీఫ్ నుంచి గంధాలను, సాదర్ తీసుకువచ్చి హజ్రత్ సయ్యద్ ఇంకే షావలి బాబా సమాధికి సమర్పించడం ద్వారా బాబా ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ప్రజలకు ఇచ్చానో వాటి సాధనకు కృషి చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి నిరంతరం పాటు పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చెర్మైన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు పి ఎస్ సి ఎస్ చెర్మైన్ పొనగంటి సంపత్ దర్గా కమిటీ అధ్యక్షుడు మమ్మద్ ఇక్బాల్, కరీం, తాప్సిక్ హుస్సేన్, నహిముద్దీన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking