ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 10 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం గుళ్లకోట గ్రామంలో విద్యుత్ షాకుతో పనాస లక్షి అనే 52 సంవత్సరాల మహిళ మృతి చెందినది.మృతురాలు ఇంటి సమీపంలో ఉన్న భూమిలో కూరగాయల సాగు చేస్తుంది.అట్టి స్థలంలో పని చేయడానికి వెళ్లి ప్రక్క పొలం వాళ్ళు వేసిన ఫీనిషింగ్ వైరుకు కరెంటు తగిలి మృతి చెందినది.ఫీనిషింగ్ వైరు ఉన్న పొలం వాళ్లకు మృతురాలి కొంతకాలంగా అట్టి స్థలం విషయంలో గొడవ జరిగింది.రెండు సంవత్సరాల క్రితం పెద్దమనుషులు సమక్షంలో పంచాయితీ కూడా పెట్టుకున్నారు.అప్పటి నుండి పక్కపోలనికి చెందిన యజమానులుఇరుకుల సత్యనారాయణ,రావుల అంజన్న,అట్టి స్థలంలో నర్సరీ నడిపే తిప్పని చిలుకయ్య ముగ్గురు మృతురాలిని చంపుతామని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు పిర్యాదు చేయగా ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఘటన స్థలాన్ని సిఐ నరేందర్ సర్ పరిశీలించారు.
పిర్యాదురాలు,పనస సౌందర్య(మృతురాలి కూతురు)ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్సై పి సతీష్ తెలుపారు.