ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల గారి ఆదేశానూసరం డ్యంగాపూర్ లోని, మహిళా ప్రాంగణంలో షీ టీం అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.ఇందులో షీటీం గురించి వివరిస్తూ మహిళలందరూ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ గాని వాట్సాప్ కాల్ గాని మాట్లాడవద్దని అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత గ్రూపుల నుండి వచ్చినటువంటి లింకులను ప్రెస్ చేయవద్దని వివరిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని, దీనిలో భాగంగా మహిళలు ఆపద సమయంలో డయల్100,షీ టీమ్ నెంబరుకు సంప్రదించాలని,ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు
ఏదైనా సమస్య వచ్చినపుడు *తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి. టి సేఫ్ ఆప్( ట్రావెల్ సేఫ్ ) ఆప్ ను ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని
ఏదైనా సమస్య వచ్చినప్పుడు మౌనంగా భరించ కుండా ముందుకు వచ్చి షీ టీమ్ ని సంప్రదించి,వారి సమస్యలను పరిష్కరించుకొవాలని తెలపడం జరిగినది.
ప్రత్యేకంగా చిన్న పిల్లలకు గుడ్ టచ్,బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాలని అవసరమైన ఆత్మ రక్షణ విద్యలను నేర్చుకోవాలి అని
సోషల్ మీడియా ను వాడుతున్న వారు వాటి పరిధి ని తెలుసు కోవాలని అపరిచిత వ్యక్తులతో మాట్లాడరాదని,
ఒక వేళ సోషల్ మీడియా లో హరాస్మెంట్,సైబర్ క్రైమ్ కు గురి అయితే తక్షణమే షీ టీమ్ కానీ,పోలీసులకు కానీ సంప్రదించాలని తెలియపర్చనైనది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని తమ వ్యక్తిగత విషయాలను వ్యక్తిగత ఫోటోలని సోషల్ మీడియాలో గాని, ఇతరులకు గాని షేర్ చేయొద్దని.అట్టి ఫోటోలను అడ్డుపెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంటుంది, కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒకవేళ ఎవరైనా అలా బ్లాక్మెయిల్ చేసినట్లయితే పరువు పోతుందని భయపడకుండా షీ టీమ్ ని సంప్రదించాలని.షీ టీం కి కంప్లైంట్ చేసినట్లయితే కంప్లైంట్ యొక్క వివరాలు గొప్యం గా ఉంచబడతాయని, బాధితురాలు షీ టీమ్ ఆఫీస్ కి రాలేని పక్షంలో షీ టీం సభ్యులే వారి దగ్గరికి వెళ్తారని కావున ఎలాంటి భయం లేకుండా కంప్లైంట్ చేయాలని, షీ టీమ్ వాట్స్ అప్ నంబర్ 8712659550 కి తెలియచేసిన చో తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది.