కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేయండి

చెదల సత్యనారాయణ కు సూచించిన “జీవన్”

జగిత్యాల, జనవరి 6: కాంగ్రెస్ చరిత్రలో వైఎస్సార్ పాలన సువర్ణ అధ్యాయమని అలాంటి వైఎస్స్సార్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం శుభపరిణామమని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. డిల్లీలో ఈ నెల 4 న వైఎస్సార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం జరిగింది. శనివారం జగిత్యాలకు చేరుకున్న వైఎస్సార్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ మర్యాద పూర్వకంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కలిశారు. వీరిని సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పాలన చరిత్రలో నిలిచిపోయిందన్నారు. వైఎస్సార్ చేపట్టిన పథకాలు ఇతర పార్టీలు అమలు పరిచాయన్నారు. వైఎస్సార్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడం రెండు తెలుగు రాష్ట్రాలలో శుభపరినామమన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్సార్ శ్రేణులు కృషిచేయాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర నాయకులు తిరుపతి గౌడ్, గంగాధర్, జాడి ప్రేమ్ సాగర్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking