ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ నవంబర్ 19 : భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీర వనిత మాజీ ప్రధాన మంత్రి ఇంద్రగాంధీ అని, ఆమె ఆశయ సాధనకు నిరంతరం కృషి చేయాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగిళి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఇందిరా గాంధీ 107 వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని, ఆమె దేశం కోసం ప్రజల సౌకర్యార్థం 1969లో బ్యాంకులను జాతీయకరణ చేసి జాతికి అంకితం చేశారన్నారు.పేద ప్రజల కోసం జాతీయ ఆహార భద్రత పథకాన్ని తీసుకువచ్చిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. గరీబ్ హఠావో నినాదంతో ముందుకు వెళ్లారన్నారు.దేశ రక్షణ కోసం అణు భద్రతను తీసుకువచ్చిన ధీర వనితని,దేశం కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమైనవన్నారు.ఈ కార్యక్రమంలో ముత్తె సుధాకర్,బియ్యాల తిరుపతి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం,పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, నలిమేల రాజు, గుండ శ్రీనివాస్, గుత్తికొండ శ్రీదర్,చిన్న రమేష్,బొప్పు సుమన్,మడిపెల్లి స్వామి,బొప్పు సతీష్,మల్లికార్జున్, హాజి,దుమ్మని సత్తన్న తదితరులు పాల్గొన్నారు.