ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి :: జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

 

ప్రసాద్ స్కీం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.

10 ఎకరాలలో ఇంటర్ప్రిటేషన్ సెంటర్.

పర్యాటకులు మౌలిక సదుపాయాల కల్పన.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 22 : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.

శనివారం జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో దివాకర టి.ఎస్. పురావస్తు శాఖ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రసాద్ స్కీం లో బాగంగా జరుగుతున్నా అభివృద్ధి పనుల వివరాల గూర్చి పురావస్తు శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రసాద్ స్కీం లో బాగంగా 10 ఎకర స్థల విస్తీర్ణం లో 61.99 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం జరుగుతున్నా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ పనులను వేగవంతం చేయాలని రామప్ప దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని , రామప్ప కు వచ్చే పర్యాటకులు స్టాల్స్, ఫుడ్ కోర్ట్స్, పార్క్, ఆడిటోరియం, టాయిలెట్స్, బ్యాటరీ వెహికిల్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.

ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అనంతరం యునెస్కో నియమ నిబంధనల ప్రకారం రామప్ప దేవాలయం పరిసరాలలో ఉన్న శివాలయం , గొల్లగుడి దేవాలయాలు రామప్ప దేవాలయం ఒకే ప్రాంగణం లో ఉండాలని వాటికి సంబంధించిన
స్థల సర్వేలు నిర్వహించాలని పురావస్తు శాఖ అధికారులు కలెక్టర్ ను కోరారు. శివాలయం , గొల్లగూడి పరిసర ప్రాంతాలను త్వరలోనే కలెక్టర్ పర్శిలించ నున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశం లో కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ రోహిణి పాండే అంబేద్కర్ , జిల్లా పురావస్తు శాఖ అధికారి యం.మల్లేష్ , పురావస్తు శాఖ సర్వేయర్ ప్రశాంత్ , ఏ ఈ విజయ్ , క్షేత్ర ఫౌండేషన్ సూర్యనారాయణ మూర్తి, కలెక్టరేట్ సూపర్ ఇండెంట్ శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking