ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 26 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నూజివీడు సీడ్స్ వారి ఆద్య ఎన్ సి ఎస్-1134 పత్తి రకం అధిక వర్షాల్లో కూడా రైతులకి అధిక దిగుబడి వస్తుందని కంపెనీ రీజినల్ మేనేజర్ వి రమణారెడ్డి చెప్పినారు చింతకాని మండలం కోదుమూరు గ్రామంలో గల ఆద్య పత్తి పంటలో గురువారం రైతు క్షేత్ర స్థాయి ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రకం వంగడం అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందన్నారు తక్కువ పంట కాలం, మరియు గులాబీ రంగు పురుగు రసం పీల్చు పురుగులను సమర్థవంతంగా తట్టుకుంటుందన్నారు తద్వారా రైతులకి క్రిమి సంహారక మందుల ఖర్చు తగ్గడం మరియు పత్తి తీయుట సులభం కాబట్టి కూలీల ఖర్చులు తగ్గుతుందన్నారు త్వరగా పంట చేతికి రావడం వలన రెండో పంటకు అనుకూలంగా ఉంటుందని, అలాగే అధిక సాంద్రత పద్దతి సాగుకు అనువైన రకం అని అన్నారు, కాబట్టి రైతులు ఈ వంగడని ఎంచుకొని సాగు చేయాలని సూచించారు.అలాగే ఈ కార్యక్రమనికి వివిధ గ్రామాల్లో నుంచి రైతులు మరియు కంపెనీ ఏరియా సేల్స్ మేనేజర్ రసూల్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు