ఈనెల 12 న జరిగే లోకదాలత్ సద్వినియోగం చేసుకోండి

పారా లీగల్ వాలంటీర్ శంకర్ రావు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు 12వ తారీఖున ఖమ్మం కోర్టు నందు జరగబోయే లోకదాలత్ గురించి కొణిజర్ల మండలంలోని తనికెళ్ళ అమ్మపాలెం రాజ్య తండా గ్రామాలలో పారా లీగల్ వాలంటీర్ కోయిన్ని శంకర్రావు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ పంచాయతీ ఆఫీసులలో రైతు వేదికలలో కంటి వెలుగు జరిగే క్యాంపు ల వద్ద స్కూల్ పిల్లల ద్వారా టీచర్స్ ద్వారా కూడా మెసేజ్ పంపించడం జరిగింది మరియు కరపత్రాలు అంటించడం జరిగింది ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కేసులు యాక్సిడెంట్ కేసులు ఇతర చలానా కేసులు ఇరువర్గాలు రాజి పడినట్లయితే 12వ తారీకు అటువంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చని రాజీమార్గమే రాజమార్గమని పారా లీగల్ వాలంటీర్ కోయిన్ని శంకర్రావు అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్స్ మరియు విద్యార్థినిలు మరియు ఆశ కార్యకర్తలు అంగన్వాడి టీచర్స్ మరియు వారి బృందం గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగింది

Leave A Reply

Your email address will not be published.

Breaking