గవర్నర్ చేతులు మీదుగా స్వచ్ఛంద రక్తదాత అవార్డు

వికారాబాద్ జూన్ 9 (:- ప్రపంచ రక్త దాతల దినోత్సవ సందర్భంగా జూన్ 14వ తేదీ బుధవారం నాడు రాజ్ భవన్ యందు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ చేతులు మీదుగా వికారాబాద్ జిల్లా నుండి స్వచ్ఛంద రక్తదాత అవార్డును సత్యనారాయణ గౌడ్ అందుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి జిల్లాకు ఒకరికి స్వచ్ఛంద రక్తదాత అవార్డును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి చేతుల మీదుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులు అవార్డుకి ఎంపికైనటువంటి సత్యనారాయణ గౌడ్ గారిని అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking