తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం స్ధలం కేటాయింపులు వెంటనే పూర్తి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్ జనవరి 5 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో పల్లె ప్రకృతివనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లు, జివో నెం.58,59,76, రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులపై బుధవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పల్లె ప్రకృతివనాలలో మొక్కల సంరక్షణ కోసం పూర్తి స్ధాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ క్రీడా ప్రాంగణాల కోసం స్ధలం కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపై జిల్లాల వారీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సవిూక్షించారు. ముఖ్యంగా జివో నెం. 58,59,76 ల పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ గ్రావిూణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, జిఏడి కార్యదర్శి శేషాద్రి, సిసి ఎల్‌ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ, సిసిఎల్‌ఏ ప్రత్యేక అధికారి సత్యశారద ఇతర అధికారులు పాల్గొన్నారు.