దృఢ సంకల్పం కలిగిన కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలం : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ప్రజాబలం శేర్లింగంపల్లి :
దృఢ సంకల్పం కలిగిన కార్యకర్తలే బిఆర్ఎస్ పార్టీకి బలమని, బిఆర్ఎస్ కార్యకర్తల వల్లే పార్టీ బలంగా ఉందని, ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం అయినా మీడియాతో మాట్లాడుతూ
తెలంగాణా సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించబడుతుందన్నారు. ఈ భారీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking