నేడే లోక్ జనశక్తి (రామ్ విలాస్ పాశ్వాన్) పార్టీ తెలంగాణ శాఖ ఆవిర్భావం

హైదరాబాద్ అక్టోబర్ 15: రాజకీయాల్లో పారదర్శకత ఉంటే పథకాలు అట్టడువర్గాలు గుమ్మం ముందుకు చేరుతాయని, అలా కానంత వరకూ ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే కొనసాగుతాయని లోక్ జనశక్తి(రామ్ విలాస్) పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కొమ్మినేని వికాస్ బాబు అన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాల వారి, మహిళల ప్రయోజనాల కొరకు లోక్ జనశక్తి పార్టీ పనిచేస్తుందని వికాస్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో భ్రష్టుపట్టిన రాజకీయాలను వ్యతిరేకిస్తూ, సమసమాజం కొరకు మా పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
తెలంగాణలో పార్టీ శాఖను ఈనెల 16వ తేదీన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
సామాజిక న్యాయం కొరకు కృషి చేసే అందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు, రాబోయే ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని కొమ్మినేని వికాస్ తెలిపారు.
యువతను రాజకీయాలవైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా వస్తున్న పార్టీ “లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)”. స్వర్గీయ శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన పార్టీకి ప్రస్తుతం ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వం వహిస్తున్నారు. నిరుపేద, అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణలో రూపొందుతున్నది “లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్!” రాజకీయ చైతన్యంతో పాటు యువతను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకెళ్తున్న “లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)” కి మీ అందరి సహకారం. ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని, నిస్వార్థ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న యువత కోసం తెలంగాణ “లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)” ఎప్పుడూ స్వాగతం
పలుకుతుందిని, వివరాల కొరకు 6281083238.ఫోన్ నంబర్ ను సంప్రదించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking