ప్రతి రోజు బిజి బిజి గా ఉండే న్యాయ వాదులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ పోటీలను కరీంనగర్ జిల్లా స్పెషల్ కోర్టు (ఎసిపి) న్యాయ మూర్తి కుమార్ వివేక్ పోటీలను ప్రారంభించారు. ఆదివారం స్థానిక లయోలా కళాశాల రేకుర్తి లో నిర్వహించిన న్యాయ వాదుల క్రికెట్ పోటీలను న్యాయ మూర్తులు లక్మి కుమారి, బానోతు రాజేశ్వర్ క్రికెట్ పోటీలను ప్రారంబించి మొదట బ్యాట్, బౌలింగ్ వేసి న్యాయ వాదులను క్రీడ స్ఫూర్తి కల్పించారు. న్యాయ వాదులు ఏ, బి, సి, డి, ఈ టీమ్ లుగా ఏర్పడి పోటీలు జరుగగా ఫైనల్ లో సి టీమ్ డి టీమ్ మధ్య పోటీలో సి టీం విన్నర్ గా, డి టీము రన్నర్ గా గెలిచారు. కార్యక్రమం లో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులతో పాటు కార్యవర్గ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. క్రికెట్ ఇన్చార్జి లుగా మడిపెల్లి రవి, టి రఘువీర్ లు, ముత్యాల తిరుపతి రెడ్డి కామెంటేటర్ గా న్యాయ వాదులను అలరించారు. గెలిచిన టీమ్ లకు ఈనెల 26 న జిల్లా ప్రధాన మూర్తి బి ప్రతిమ బహుమతులు అందజేస్తారు.