జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న డిసిఎం ను ఢీకొని కారు బోల్తా కొట్టింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు. డిసిఎం టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కన ఆపి టైరు మారుస్తుండగా ఘటన జరిగింది. డిసిఎం డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఆరు ఏళ్ల పాప చనిపోయింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు.