హత్ సే హత్ ప్రారంభంలో జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుల్లు
జోడో యాత్ర స్ఫూర్తితో హత్ సే హత్ యాత్ర
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 06 (ప్రజాబలం) ఖమ్మం హత్ సే హాత్ యాత్రలో భాగంగా ప్రతి ఇంటిని ప్రతి గడపను తడతామని ప్రతి సమస్యను తెలుసుకుంటామని జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళా దుర్గా ప్రసాద్, మహమ్మద్ జావేద్ లు అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం, టీ పీ సీసీ, సీ ఎల్పీ సూచన మేరకు సోమవారం ఖమ్మం నియోజకవర్గం లో 9 వ డివిజన్ లో హత్ సే హత్ యాత్ర ను ప్రారబించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి కాంగ్రెస్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ హత్ సే హత్ యాత్ర ను ప్రారంభించిందని తెలిపారు. జోడో యాత్ర స్ఫూర్తితో హత్ సే హత్ యాత్ర ను విజయవంతం చేస్తామని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు విసుగు చెందారని యావత్ భారతదేశం కాంగ్రెస్ వైపు చూస్తుందని అన్నారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్,గ్యాస్, విద్యుత్ ఛార్జీలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని, దీంతో సామాన్యులు బతకలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కెసిఆర్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని, రాష్ట్రాన్ని ఆగం చేసింది కాక దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. యావత్ ప్రజానికం మోడీ, కెసిఆర్ మాటలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కరపత్రాలను పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో నగర కార్పొరేటర్ లు 2వ డివిజన్ కార్పొరేటర్ మలిదు వెంకటేశ్వర్లు,8వ డివిజన్ కార్పొరేటర్ లాకవత్ సైదులు,5వ డివిజన్ కార్పొరేటర్ పల్లెబాయిన భారతీ చంద్రం, పిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు, వడ్డే నారాయణ, మలోత్ రాందాస్ నాయక్, పుచ్చకాయల వీరభద్రo, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్య, ఖమ్మం మైనారిటీ అద్యక్షులు అబ్బాస్ బెగ్, బీసీ సెల్ నగర అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, డివిజన్ అద్యక్షులు బోజెడ్ల సత్యనారాయణ,దేవత్ దివ్య శంకర్ నాయక్, భీమా రెడ్డి రమేష్, షేక్ రజ్జి, బండి నాగేశ్వరరావు, వెనిగండ్ల సత్యనారాయణ, దొడ్డ ప్రవీణ్,వెచ్చ చలపతి రావు, గడ్డం వెంకటయ్య, పర్వత శ్రీను, నుకారపు వెంకటేశ్వర్లు,మామిడాులు పుల్లయ్య, వీరయ్య గౌడ్, దారమల్ల భాస్కర్, దాసరి పూర్ణచంద్ రావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మారం కరుణాకర్ రెడ్డి,జీరిపోతుల అంజిని, బచ్చలి కూర నాగరాజు కుమార్, బోయిన వేణు, గడ్డికొప్పుల ఆనంద రావు, సామినేని ముత్తయ్య, గజ్జెలి వెంకన్న, గదారి బాబు, గంగరాజు, ముజహిద్, కిలారు వెంకటరమణ, షేక్ ఇబ్రహీం,కీలారు అనిల్,గోపి, ఖాదర్, రియాజ్, నిఖిల్, షేక్ జహీర్, పెరం యశ్వంత్ వర్ధన్, నాని,రఘునాథ పాలెం మండల నాయకులు భూక్యా బాలాజీ, సర్పంచ్ బాతుల రమణ సుధాకర్ యాదవ్,కొంటేముక్కుల నాగేశ్వరరావు, జోనాబాయిన పాపయ్య, ఆలస్యం సూరయ్య, లక్పతి, భూక్యా వెంకన్న, మాధం శెట్టి హనుమంతరావు, తావుర్య నాయక్, బానోత్ మోహన్, గుగులోత్ అనిల్,అనిల్, షారుక్, మాలోత్ శంకర్ నాయక్, తేజావాత్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.