బహుజన నాయకత్వంపై అక్రమ కేసులు పై నిరసించాలి
చక్రధర్ గౌడ్ అక్రమ అరెస్టు పై నిరసన
పెద్దపల్లి ప్రజాబలం ఫిబ్రవరి 6÷
బహుజన అమరుల త్యాగాలతో సాధించిన తెలంగాణలో ఇటీవల బహుజన నాయకులపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలు వేధింపులు పెరిగిపోతున్నాయని పెద్ద పెళ్లి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు సోమవారం పెద్దపెల్లి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద సాంఘిక సేవా తాత్పర్యుడు బహుజన బిడ్డ సిద్దిపేట వాసి చక్రధర్ గౌడ్ పై మంత్రి హరీష్ రావు అక్రమ పోలీస్ కేసులు నమోదు చేయడం ఆధిపత్య వర్గాల దురాహంకారమని వ్యక్తం చేస్తూ శ్రీమన్నారాయణ నిరసన తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావుకు నూకలు చెల్లుతున్నాయని చక్రధర్ గౌడ్ ప్రజాసేవ ద్వారా దూసుకుపోతుండడం బహుజన సామాజిక వర్గం అతని వెంట నడవడం హరీష్ రావుకు కంటగింపుగా మారిందని అన్నారు చక్రధర్ గౌడ్ తన సాంఘిక సేవా ట్రస్టు ద్వారా సిద్ధిపేట నియోజకవర్గంలో 100 మంది కౌలు రైతుల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున వితరణ చేయడం అగ్రవర్ణ దృహంకారి హరీష్ రావు తట్టుకోలేక అక్రమ కేసులు బలయించడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు కోటి రూపాయలు పైగా సిద్దిపేట నియోజకవర్గంలో రైతాంగానికి అంది ఇవ్వడం తప్ప అని హరీష్ రావును శ్రీమాన్ ప్రశ్నించారు అంతేకాకుండా మరో ఐదు 500 మంది రైతులకు తెలంగాణ వ్యాప్తంగా లక్ష రూపాయల చొప్పున 5 కోట్లు తన స్వచ్ఛందంగా సహాయం చేయడానికి ముందుకు రావడం హరీష్ రావుకు నచ్చక అక్రమ కేసులు పెట్టించాడని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు ప్రజా వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు తన రాజకీయ జీవితానికి ఎదురులేదని విర్రవీగుతున్న సమయంలో చక్రధర్ గౌడ్ నియోజకవర్గ రాజకీయాలలో అప్రహతియాసంగా దూసుకుపోవడం తో బట్ట కాల్చి మీద వేశారని తెలిపారు. మహిళపై చక్రధర్ గౌడ్ అత్యాచారం చేసినట్లు అక్రమ కేసులు బనాయించిన న్యాయస్థానంలో నిలవజాలం అని తెలిపారు సిద్దిపేట మహిళలు మంత్రి హరీష్ రావు రాజకీయ కుట్రలను చేదిస్తారని తెలిపారు సిద్దిపేట మహిళలోకమంతా అధైర్య పడకుండా చక్రధర్ గౌడ్ వెంట నడుస్తున్నారని తెలిపారు మహిళలను కించపరిచే విధంగా కేసులు పెట్టడం పై మహిళా లోకం నిరసించాలని కోరారు పెద్దపల్లి లో జరిగిన నిరసన కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నాయకులు బండి రఘు గుల్లపల్లి శంకర్ జిల్లా సురేష్ బి. సతీష్ ఇమ్రాన్ జమీన్ అజీమ్ తదితరులు పాల్గొన్నారు