యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి సౌజన్యంతో, వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యుల సహకారాలతో ఉచిత మేఘా హెల్త్ క్యాంప్
మణికొండ ప్రజాబలం ప్రతినిధి:యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ వారి సౌజన్యంతో, వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యుల సహకారాలతో ఉచిత మేఘా హెల్త్ క్యాంప్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మనికొండలో జరుప బడీనది, ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే రామకృష్ణా రెడ్డి, పాఠశాల ప్రధాోపాధ్యాయుడు నిరంజన్, బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు సీతారామ్ దాస్, ప్రదీప్ రావు, కుమార్, హల్డార్, నాగేంద్ర, విజయలక్ష్మీ మరియు అందె లక్ష్మణ్ రావు ఆర్ధిక సహాయ సహకారాలతో విచ్చేసిన వారందరికీ డాక్టర్ల సలహా మేరకు అవసరమైన అన్ని రకాల మందులు ఉచితంగా నోయల్ ఫార్మా వారి సహకారంతో ఇవ్వడమ్ జరిగినది మరియు బీ పీ, రక్త పరీక్షలతో పాటు అవుసరమైన వారికి ఈ సీ జీ, ఎక్స్ రే, బోన్ మారో టేస్ట్, 2 డీ ఎకో, పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగినదని ఇట్టి సదావకాశాన్ని మనికొండ కౌన్సిల్ ప్రాంత నివాసితులు సద్వినియోగ పరచుకోన్నారని వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు తెలియజేసిన్నారు.