సామూహిక అక్షరాభ్యాసం

 

ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ అక్టోబర్ 9:శరన్నవరాత్రులలో భాగంగా నాచారం విఎస్టీ కాలనీలో ఏర్పాటు చేసిన అమ్మవారు సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీ దేవి పూజ సందర్భంగా ఎస్ ఎస్ ఎస్ యువసేన, మాజీ సైనికుడు,యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక అక్షర అభ్యాసం నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చేత అమ్మవారికి పూజలు చేయించారు. 200 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్ల రాధాకృష్ణ, మామిడాల రాజారెడ్డి, లోకేందర్ రెడ్డి, కృష్ణారావు, కృష్ణ కిషోర్ రెడ్డి, అనిల్ రెడ్డి, మధు, సాయి, గురు, శివ, శ్రీధర్, సాయి ముదిరాజ్ శివ ముదిరాజ్, శ్నేహిత్, శ్రీకాంత్, రాజు, గణేష్, నరసింహ సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking