మణికొండ ప్రజాబలం ప్రతినిధి:మణికొండ మండల జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ లో బోర్ ఎండి పోయి ఈ మధ్య కాలంలో నీటి ఎద్దడి ఏర్పడడంతో విద్యార్ధుల ఇబ్బందిని గమనించి వారి సౌకర్యార్ధం జలమండలి వారి సహకారంతో నీటి కనెక్షన్, కౌన్సిలర్స్ ఇంకా ఇతరుల సహాయ సహకారాలతో నీరు పంపు చేయుటకు మోటర్ మరియు సింటెక్స్ టాంక్ లు తదితర పైప్ లైన్ లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించటం జరిగిందని బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ స్థానిక కౌన్సిలర్ కే.రామకృష్ణ రెడ్డి తెలుపినారు, ఇందుకు గాను సహకరించిన వారందరికి ప్రధాన ఉపాధ్యాయుడు మంగ్యా నాయక్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కున్నారు.