హార్థిక్‌ పాండ్యా ఇలా తిట్టేసాడేంటి?

మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే హార్దిక్‌ పాండ్యా మైదానంలో కాస్త అగ్ర సేవ్‌ గానే ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక సహచర ఆటగాళ్లు ఎవరైనా తప్పు చేశారు అంటే చాలు ఇక వారిపై నిప్పులు చెరుగుతూ ఉండడం కూడా అప్పుడప్పుడు మైదానంలో చూస్తూ ఉంటాం. అయితే ఎంత అగ్ర సేవ్‌ గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు మాత్రం నోటిని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాత్రం ఏకంగా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి. హార్దిక్‌ పాండ్యాకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిరది అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్‌ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మొదటి మ్యాచ్లో 67 పరుగుల తేడాతో విజయం సాధించి అదరగొట్టిన టీమిండియా జట్టు.. ఇక రెండో వన్డే మ్యాచ్లో సైతం ఇలాంటి విజయాన్ని సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ ల సిరీస్‌ లో భాగంగా ఇక ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో టీమ్‌ ఇండియా సిరీస్‌ ను కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌ లో భాగంగా భారత బౌలర్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు అని చెప్పాలి. అయితే భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌ గా కొనసాగుతున్న హార్దిక్‌ పాండ్యా సైతం ఒక విషయంలో తన సహనాన్ని కోల్పోయాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో వాటర్‌ బాటిల్‌ అందించడం ఆలస్యం కావడంతో సహచర ఆటగాడు అయినా ఫీల్డర్‌ పై గట్టిగా అరుస్తూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఇక ఇదంతా స్టంప్స్‌ మైక్‌ లో రికార్డు కావడం గమనార్హం. శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో 11 ఓవర్లో వాటర్‌ కావాలి అంటూ వాషింగ్టన్‌ సుందరకు తెలిపాడు. అయితే అతను వాటర్‌ తెచ్చి ఇచ్చిన తర్వాత ఇంతకుముందు ఓవర్‌ లో వాటర్‌ కావాలని అడిగాను. ఇప్పటివరకు ఏం చేస్తున్నావ్‌ అంటూ ఇక కాస్త బూతులు జోడిస్తూ కోపగించుకున్నాడు హార్దిక్‌ పాండ్యా.

Leave A Reply

Your email address will not be published.

Breaking