ఇంటర్‌నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఎపియోన్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో తన మూడవ యూనిట్‌ను యువ క్రీడాకారుల గాయ నివారణ శిబిరాన్ని సుధీర్ దారా, డాక్టర్ మినల్ చంద్ర శనివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ రంజీ ప్లేయర్స్ కెప్టెన్, ముంబై ఇండియన్ కెప్టెన్, ఐపీఎల్ ప్లేయర్ రాహుల్ సింగ్, ఆంధ్రప్రదేశ్ టీమ్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ప్లేయర్ స్నేహ దీప్తి హాజరై మాట్లాడుతూ ‘ఇంతకుముందు తాము క్రీడా గాయాల చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదని, తద్వార ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ప్రస్తుతం ఎపియోన్ తమకు ఒక ఆశీర్వాదంగా గాయ నివారణ శిబిరాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాము అత్యవసర పరిస్థితుల్లో సందర్శించవచ్చని, విదేశాలతో పొలిస్తే ఇక్కడ ఛార్జీలు చాలా సహేతుకమైనవని, సిబ్బంది ,వైద్య బృందం చాలా అనుభవం తో ఉన్నందున తాను ఎపియోన్‌ని సిఫార్సు చేస్తున్నానని చెప్పారు .
ఈ శిబిరంలో సిబ్బందితో భంగిమ విశ్లేషణ, వర్చువల్ రియాలిటీ రిఫ్లెక్స్ విశ్లేషణ, ఎముక ఖనిజ సాంద్రత, ఆహారం/పౌష్టికాహార అంచనాల ప్రదర్శనను నిర్వహించారు. క్రానిక్ పెయిన్ మేనేజ్‌మెంట్, మోకాళ్ల నొప్పులకు ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, పెయిన్ మేనేజ్‌మెంట్ ,క్యాన్సర్ నొప్పులు మొదలైన వాటి కోసం కొత్త కోణంతో నొప్పి నిర్వహణ కోసం మల్టీడిసిప్లినరీ కేర్‌తో దక్షిణ భారతదేశంలో ఇది ఏకైక కేంద్రం. ఎపియోన్ నొప్పి నిపుణుల బృందం తాజా సమగ్రమైన, దీర్ఘకాలిక నొప్పి పరిస్థితుల చికిత్సలో బహుళ మోడల్ విధానమని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ .మినల్ చంద్ర కన్సల్టెంట్ పెయిన్ ఫిజిషియన్మఎపియోన్ సహ వ్యవస్థాపకులు మాట్లాడుతూ నొప్పి నిర్వహణ అనేది భారతదేశం, యుఎ స్ ఎ యూరోపియన్ దేశాలలో సూపర్ స్పెషాలిటీ విభాగం. ఈ ప్రత్యేక వైద్య విభాగం యొక్క లక్ష్యం నొప్పిని జయించడమని, సమాజాన్ని నొప్పి లేకుండా చేయడమని చెప్పారు. ఈ మస్క్యులోస్కెటల్ అసెస్‌మెంట్ , గాయం నివారణ శిబిరం వివిధ రంగాలకు చెందిన క్రీడాకారులు . అథ్లెట్ల అవసరాలను తీర్చడానికి అవగాహనను తీసుకురావడానికి ఉద్దేశించబడిందన్నారు. తద్వారా వారి గాయాల నుండి విశేషమైన ఉపశమనం పొందిన 50000 మంది రోగులు చికిత్స పొందారు. మా సెర్నర్‌లో టెలికాలర్లు, అడ్మినిస్ట్రేటర్‌లు, వర్చువల్ రియాలిటీ విభాగం , అర్హత కలిగిన వైద్య సిబ్బందితో కూడిన 52 మంది అద్భుతమైన సిబ్బంది ఉన్నారు.