మనోహరాబాద్, ఏప్రిల్ 6 ప్రజాబలం న్యూస్ :- మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల పరిధిలోని జిల్లా డిఆర్డిఓ అధికారి ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా కనీసం మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వము వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలంలోని గ్రామాలైన పరికిబండ, లింగరెడ్డిపేట్, రంగయ్యపల్లి, కూచారం గల గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య కార్యదర్శి పద్మ, ఏపిఎం పెంట గౌడ్, ఏఈఓ సచిన్, సిసి విజయలక్ష్మి, శోభారాణి, పంచాయతీ సెక్రెటరీ భాస్కర్, గ్రామసంఘం నాయకులు, వివోఏలు రైతులు పాల్గొని విజయవంతం చేశారు.
