తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇవి వేణుగోపాల్ గారు ఆదివారం కరీంనగర్ కు రానున్నారు. ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:30 ని. లకు మంకమ్మతోట లోని వారి స్వగృహం నకు చేరుకుంటారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. నవీన్ రావు గారి తల్లీ గారైన “దశదిన” కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి హైదరాబాద్ కు వెళ్తారు.