జిల్లాలో 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 17:
జిల్లా వ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2022-23 రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, అన్నారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2022-23 రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద చేపట్టవలసిన ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతోకలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పటిష్ట ఏర్పాట్లను చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకుని వచ్చే రైతుల కొరకు షామియానా, మంచినీరు, కూర్చీలను ఏర్పాటు చేయాలని, ధాన్యాన్ని ఎఫ్ఎక్యూ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు వెంటనే పూర్తిచేయా లన్నారు. కోనుగొలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన నాటి నుండి మిల్లులకు తరలించే వరకు పగడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని త్రాగునీరు, షామియానా, కుర్చీలు ఏర్పాటు చేయాలని, ధాన్యం కొలువలు సంబంధించిన వివరాలను ట్యాబ్ లో ఎంట్రి ఎరోజు కారోజు పూర్తిచేయాలని ఆదేశించారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవైన సంఘటనలు సంబంవించి నట్లయితే వెంటనే పై అధికారుల దృష్టికి వెంటనే తీసుకువేళ్లాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి దాన్యం తరలింపులా లారీల కొరత ఏర్పడకుండా చూడాలని, సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్యాడిక్లినర్లు, తేమశాతం కొలుచు మిషన్ లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మిల్లర్లు ఎఫ్ఎక్యూ ప్రమాణాల విషయంలో ఇబ్బందులు సృష్టించరాదని, కేంద్రాల నుండి వచ్చె ప్రతి దాన్యం గింజను కొనుగోలు చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, డిసిఓ శ్రీనివాస్, డిఎస్ఓ తనుజా, డియంసీఎస్ రాజేందర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వివిధ శాఖల అధికారులు, లారి అసోసియెషన్ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.