ఘనంగా షిరిడి సాయి బాబా మందిరం 12వ వార్షికోత్సవ వేడుకలు.

 

పంచామృత అభిషేకాలు నగర సంకీర్తన ప్రత్యేక అలంకారణ తో హారతులు మహానదానం.

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 16 (ప్రజాబలం) ఖమ్మం గాంధీ చౌక్ వరప్రదాత శ్రీ షిరిడి సాయి బాబా మందిరం 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయం చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నగర సంకీర్తన , బాబా వారికి అభిషేకాలు , ప్రత్యేక పూజలు మరియు మంగళ హారతులు , ప్రవచనాలు వంటి కార్యక్రమాలను నిర్వహించారు . బాబావారు ప్రత్యేక అలంకారంతో వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారు . అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో సుమార్ గా 3,000 మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమానికి చీప్ గెస్ట్ సత్యసాయి రాష్ట్ర ఆధ్యాత్మిక సమన్వయకర్త రేగల అనిల్ కుమార్ , ముఖ్యఅతిథిలుగా నగర మేయర్ పూనకొల్లు నీరజ , మార్కెట్ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత , ఎస్ ఎల్ ఎస్ ఎస్ అధినేత భోగ శ్రీనివాస్ , నారాయణ స్వామి ( అయ్యప్ప స్వామి గుడి ) , సిద్ధాంతి రామడుగు నరసింహచారి లు పాల్గొని బాబా వారి కృప పాతులయ్యారు . ఈ సందర్భంగా వచ్చిన అతిథులను ఘనంగా శాలువలు తో సత్కరించి బాబా వారి ఫోటో ప్రేమను అందజేశారు . ఈ కార్యక్రమంలో స్థానిక 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు , అర్వపల్లి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking