కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమరణ నిరాహార దీక్ష 2 వ రోజు

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 01 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని గుడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు,ప్రజా ప్రతి నిధులు ఆమరణ నిరాహారదీక్ష రెండవ రోజుకు చేరింది.బుధవారం రైతులతో కలిసి మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దీక్షలో పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ… మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సూచనల మేరకు ఆమరణ దీక్ష చేపట్టారు.గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.తరచు పైపు లైన్లు పగిలిపోయి పంటలకు నీరు అందడం లేదని అన్నారు. అనంతరం గడ్డం త్రిమూర్తి మాట్లాడుతూ….దండేపల్లి,లక్షెట్టిపేట,హజీపూర్ మండలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని విధిలోని స్థితిలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినట్లు వారు తెలిపారు. అధికారులు,పాలకుల అలసత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,ఎంపీటీసీలు కొంగల నవీన్,తోట మోహన్ నాయకులు కంది సతీష్,ఆకుల దుర్గ ప్రసాద్, కోట్నాక తిరుపతి,చిట్ల రమణ, బత్తుల రమేష్,దుమ్మని సత్యం, బొమ్మన మల్లేష్,కనక జంగు, చుంచు నగేష్,మబల్లికొండ మల్లేష్ లు,ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు.వీరికి మద్దతుగా జిల్లా నాయకులు,మండల నాయకులు,కాంగ్రెస్ కార్యకర్తలు, యువ నాయకులు,రైతులు మద్దతు తెలపడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking