👉జిల్లా ఎస్పీ సిహెచ్. రూపేష్ ఐ.పి.యస్.
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (మార్చ్ 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపియస్,ఒక ప్రకటనలో తెలియజేశారు,కావున పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు,జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు, అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.