ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 12 : మంచిర్యాల జిల్లాలోని నియోజకవర్గ పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ నుండి 500 మంది కాంగ్రెస్ పార్టీ కి చేరారు.శుక్రవారం భీమారం టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి,జిల్లా చెకుర్తి సత్యనారాయణ రెడ్డి,సీనియర్ నాయకుడు వెల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మజీ జెడ్పిటిసి రాజ్ నాయక్,మాజీ సర్పంచ్,వార్డు సభ్యులు సీనియర్ నాయకులు, బిఆర్ఎస్ నుంచి 500 మంది చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం బిఆర్ఎస్ పార్టీ నుండి జెడ్పిటిసి,మాజీ సర్పంచులు,వార్డ్ మెంబర్ సిన్సియర్ నాయకులు, సుమారు 500 మంది సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి రావటం జరిగింది తెలిపారు. అనంతరం పార్టీ లో చెరికైనా వారు మాట్లాడుతూ…లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మా వంతు కృషి చెస్తు,కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నల్లాల ఓదెలు వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.