జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జగ్జీవన్ కుమార్
ఖమ్మం ప్రతినిధి మార్చి 15 ప్రజాబలం ఖమ్మం జిల్లా కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జగ్జీవన్ కుమార్ చేతుల మీదుగా డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ లైబ్రరీ అనేది న్యాయవాదులకు వరం లాంటిదని, కోర్టులో డిజిటల్ లైబ్రరీ ఉండడం వల్ల న్యాయవాదులు ఇంటర్నెట్ సాయంతో జడ్జిమెంట్లు సైటేషన్స్ పలు ఇతర ఆన్లైన్ అవసరాలకు న్యాయవాదులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు కృషి చేసినందుకు గాను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దిరిషాలకృష్ణారావు, గ్రంథాలయ కార్యదర్శి గాజుల అమర్నాథ్ , మరియు బార్ కార్యవర్గాన్ని జిల్లా న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారుఈకార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ ప్రదాన కార్యదర్శి మన్నేపల్లి బసవయ్య ఉపాధ్యాక్షుడు మాధిరాజు లక్ష్మీ నారాయణ కోశాధికారి ఎం.జె.ప్రవీణ్ , జాయింట్ సెక్రెటరీ విజయ రాఘవ, మహిళా ప్రతినిధి కె.వి వి.లక్ష్మీ బార్ కార్యవర్గ సభ్యులు
సింగం జనార్ధన్ ఇందిర అరుణ సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు