బైంసాలో కలెక్టర్ విస్తృత పర్యటన ఏరియా ఆసుపత్రి ఆకస్మికతనికి

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా… బైంసా పట్టణంలో గురువారం జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి గుండెగాం బాధితులతో మాట్లాడారు. అనంతరం గుండెగాం గ్రామానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల పంపిణీ ముధోల్ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డితో కలిసి చేశారు. అదేవిధంగా 222 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, 85 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు కలిపిస్తున్న వివరాలను తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో రవికుమార్, తహసిల్దార్, ఎంపీపీ కల్పనా గణేష్ పటేల్, బిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తుంరాజేశ్వర్, పట్టణ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.*

Leave A Reply

Your email address will not be published.

Breaking