రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వంజరి సేవా సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్ జూన్ 8 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేతివృత్తులు మరియు కులవృత్తులు కలిగిన కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయ పథకాన్ని వంజరి కులస్తులకు కూడా వర్తింపచేయాలని అఖిలభారత వంజరి సేవ సంఘం, తెలంగాణ వంజరి సేవా సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆ సంఘం జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సాల్వేరు కృష్ణ వంజరి అధ్యక్షులు ఎదుగాని శంకర్ నారాయణ,ప్రధాన కార్యదర్శి దాత్రిక ధర్మరాజు ఉపాధ్యక్షులు పిట్టల అంజయ్య ఎదగని హరినాథ్ కార్యదర్శులుఎదుగానిరామకృష్ణ లండేరి శ్రీనివాస్ వాలేరు రామకృష్ణ లు విజ్ఞప్తి చేశారు.వ్యవసాయము, పశుపోషణ పశువర్ధకము వ్యవసాయ ఆధారిత పనులను ముఖ్యవృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్న వంజరి కులస్తులను ఆదుకోవడానికి వ్యవసాయ వ్యవసాయేతర పనిముట్లు కొనుగోలు చేయడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ 75 ఏళ్ల స్వాతంత్ర కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంజరి కులస్తులకు ఎటువంటి పథకాలను ప్రకటించలేదనిఅనేక చిన్న చిన్న వృత్తులు కొనసాగిస్తూ నిరుపేద మధ్యతరగతి జీవితాలు కడుతున్న మంజూరు కులస్తులను ఆర్థిక ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పథకాన్ని వంజరి కులానికి వర్తింపజేయాలని వారు సీఎం కేసీఆర్ కు, విజ్ఞప్తి చేశారు.
Prev Post
Next Post