ఖురాన్ పఠనం పూర్తి చేసినవారికి ఘనంగా సన్మానం

 

జహీరాబాద్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 29(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/జహీరాబాద్ పట్టణ కేంద్రంలో గల భారత్ నగర్ ( తమ్మడ్ పల్లి )లో గత 26 రోజులుగా రంజాన్ మాసం ప్రారంభ మైన నాటి నుంచి శుక్రవారం రాత్రి వరకు కాలనీ పరిధిలోని వార్డులో మజీద్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని ఘనంగా పురస్కరించుకోవడమే కాకుండా ప్రతిరోజు అనంతరం ఈషా నమాజ్ రోజుకు ఒక పర పఠనం చేసి ఖురాన్ పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మహమ్మద్ ఖదీర్ అహ్మద్ (కేకే ) ఆధ్వర్యంలో మస్జిద్ ఇమామ్, మౌలానాలకు శాలువా పూలమాలవు కప్పి ఘనంగా సత్కరించారు. భారత్ నగర్ కాలనీకి ఎన్నో సేవలు అందించి కాలనీ వాసుల కష్టసుఖాలు అందు బాటులో ఉండి సేవలందించిన ఘనత మహమ్మద్ ఖదీర్ అహ్మద్. మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇమామ్ అంకితభావంతో రోజువారి ఖురాన్ పట్టణంలో చేసే ముస్లింలకు ముక్తి వైపు నడిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ నగర్ కాలనీ వాసుల యోగక్షేమాలు గురించి దేవుడితో నిరంతరం ప్రార్థన చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking