హైదరాబాద్ ఫిబ్రవరి 16 ();పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రజలలో చైతన్యం కల్పించడానికి ఈనెల 22న విజయవాడలో బీసీ సేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జలపాలని నిర్ణయించారు. ఈరోజు రెండు రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు చెందిన బీసీ సేన నాయకులు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో బీసీ భవన్ లో సమావేశం జరిపారు. ఈ సమావేశానికి బర్క్ కృష్ణ యాదవ్, సొంటి నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సభకు ప్రతి జిల్లా నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. ఆర్. కృష్ణయ్య ప్రంగిస్తూ ఈ దేశంలో గత 75 సంవత్సరాల గా పాలించిన కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాట్ ఇవ్వలేదు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 70 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టే దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారులు బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు ఇలా అన్యాయం జరుగుతుందన్నారు. ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడు దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగాలి. బి.సి లకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనది. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి లకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం ప్రాతినిథ్యం లేదంటే బి.సి లకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది. ఈ సమావేశానికి బర్క కృష్ణయ్య, సొంటి నాగరాజు, లాల్ కృష్ణ, కృష్ణయాదవ్, గొరిగే మల్లేష్, వేముల రామ కృష్ణ, సి. రాజేందర్, శ్రీశైలం, రాములు తదితరులు ఉన్నారు.