డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో భారీ ర్యాలీ “ఆందరూ ఆహ్వానితులే”

సంగారెడ్డి ఏప్రిల్10 ప్రజ బలం ప్రతినిధి:
ఈ నెల బి.ఆర్ అంబేద్కర్ 14-04-2023 జయంతి ఉత్సవాల సందర్భంగా బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ప్రపంచ, మేదావీ డాక్టర్ బాబ సాహెబ్ అంబేడ్కర్ 132 వ జయంతోత్సవ కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ఎస్సీ. ఎస్ టి, బిసి మైనార్జి ప్రజ హక్కుల అధికారం కోసం తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కొరకు పొరటం చేసిన నాయకుడు అంబేద్కర్. కావున ఆయన ఆదర్శాలను ప్రజలకి తెలియజేసి చైతన్య పరచడానికి ఈ ర్యాలీ ప్రారంభం : సా|| 5.30 ని॥ లకు సంగారెడ్డి x రోడ్ పి.ఎస్.ఆర్. గార్డెన్స్ నుండి ముగింపు: పాతబస్టాండ్ వద్దగల డా|| బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు వుంటుందన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆదర్శ ప్రాయుడు భారత జాతీయవాది డాక్టర్ బీంరావు రాంజీ అంబేద్కర్, పిడిత ప్రజల పక్షపాతి, ప్రపంచ మేధావిగా, కీర్తి ప్రతిష్ఠలు పొంది మన బహుజన సమాజం మొత్తం ఆత్మగౌరవంతో జీవించే విధంగా, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళే విధంగా వారి అడుగుజాడ ల్లో నడుచుకుంటు వెళ్లాలని ప్రయత్నంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామలలో, తండాలల్లో, మండలాలలో ఉన్నటువంటి పెద్దలు, యువజన సంఘాల నాయకులు, విద్యార్థులు, మహిళలు, అధికారులు,
మేధావులు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్శకులు ఇలా ప్రతిఒక్కరు తమ వంతుగా డాక్టర్ బి.ఆర్ అంటేడ్వర్ గారి ఆశయ సాధనలో భాగంగా మీరంతా ర్యాలీ లో కలిసి రావాలని కోరుతూ..ఈ విజయోత్సవ కార్యక్రమం విజయంవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాామని. అంబేద్కర్ జయంతి ఉత్సవ సంగారెడ్డి జిల్లా కమిటీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking