కార్వాన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎ కృష్ణ (మిత్రకృష్ణ)

ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ ఆగష్టు 24 ();కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గ భారాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎ. కృష్ణ (మిత్రకృష్ణ) పేరు ఖరారైంది. ఈ మేరకు వారాస పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్వాన్ భారస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎకృష్ణ (మిత్రకృష్ణ) పేరును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్వాన్ గుడిమల్కాపూర్ శిల్బాగ్ గాయత్రీనగర్ ప్రాంతానికి చెందిన ఎ.కృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందినవారు. బీకాం, ఎల్.ఎల్.బి పూర్తి చేశారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మిత్రకృష్ణ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే రాజకీయాలపై మక్కువతో మొదట్లో ఎం.ఐ.ఎం పార్టీలో చేరి జియాగూడ కార్పొరేటర్ గా ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చవిచూశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1996 నుంచి కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ గా దాదాపు పదిహేనేళ్లపాటు పనిచేశారు. తదనంతరం 2011లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జియాగూడ మున్సిపల్ డివిజన్ నుంచి బల్దియా ఎన్నికల్లో పోటీచేసి కార్పొరేటర్ గా గెలుపొందారు. 2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెరాస గా ఆయన పార్టీలో చేరి 2016లో తెరాస పార్టీ అభ్యర్థిగా తిరిగి జియాగూడ డివిజన్ నుంచే గ్రేటర్ బల్దియా ఎన్నికల బరిలో నిలిచి మరోసారి కార్పొరేటర్గా గెలుపొందారు. కార్పొరేటర్ ‘హయాంలోనే పురానాపూల్ చౌరస్తా నుంచి కార్వాన్ మొఘల్ కానాలా వరకూ దశాబ్దాలుగా పెండింగ్లో ఉంటూ వచ్చిన 1000 ఫీట్ల బైపాస్ రోడ్డు పూర్తికావడం విశేషం. జియాగూడ బల్దియా కాలనీలో 1974వ సంవత్సరంలో నిర్మించిన 560 మున్సిపల్ క్వార్టర్స్ భవనాలు పూర్తిగా శిధిలావస్థకు చేరి కొన్ని కూలిపోయి ఇద్దరు కాలనీవాసులు మృత్యువాతపడటంతో సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిని కూల్చివేసి వాటి స్థానంలో 810 డబుల్ బెరూమ్ ఇళ్లు నిర్మించేందుకు కృషిచేసిన ఘనత పొందారు. రెండున్నరేళ్ల క్రితం జరిగిన గ్రేటర్ బల్దియా ఎన్నికల్లో కూడా జియాగూడ నుంచే మరోసారి కార్పొరేటర్ పదవికి పోటీచేసిన మిత్రకృష్ణ తన ప్రత్యర్థి పార్టీ భాజపా అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తాను ఓటమిపాలైనా జియాగూడలో భారాస పార్టీ కార్యాలయాన్ని కొనసాగిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మరోవైపు మిత్రా అసోసియేట్స్ సంస్థ పేరుపై పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మెరిట్ విద్యార్థులకు, ఉత్తమ క్రీడాకారులకు, సంఘసేవకులకు అంబేద్కర్ విద్యా వికాస్ అవార్డులను అందజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏకుగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గ భారాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ అధిష్టానం తన పేరును ఖరారు చేయడం పట్ల మిత్రకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ శ్రేణులు, అభిమానులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనకు అభినందనల్లో ముంచారు. ఈ సందర్భంగా మిత్రకృష్ణ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతకు న్యాయం చేస్తానని, కార్వాన్ నియోజకవర్గంలోని సుమారు 98వేల దళితుల మద్దతుతో పాటు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలో గట్టిపోటీనిచ్చి కార్వాన్ ఎమ్మెల్యేగా గెలుపొంది గోల్కొండ కోటపై గులాబి జెండా ఎగురవేసి తీరుతానని ఈ సందర్భంగా మిత్రకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking