అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

 

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం. శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 30 : రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ కె. వెంకటరమణ రెడ్డి హెచ్ సీ 2105 గారు అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య వెంకట తులసి దేవి కి భద్రత ఎక్స్గ్రేషియా 7,98,320/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్ తన కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా మరణించి హెడ్ కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ అశోక్ కుమార్, సూపరిండెంట్ సంధ్య,రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లాకుంట పోచలింగం,స్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking